Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్మెంట్లు, కోవిడ్, దర్శకుడు ఇతర ప్రాజెక్టులతో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తల్లూరి తన SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసినప్పటికీ, అనేక కారణాల వల్ల వాయిదా పడింది. దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో అఖిల్ అక్కినేనితో చేసిన “ఏజెంట్” సినిమాతో బిజీగా ఉండగా, పవన్ రాజకీయాల్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ తను కమిటైన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను పూర్తిచేశారు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి సినిమాకు పవన్ కాల్షీట్లు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.సురేందర్ రెడ్డి సినిమాలకు ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆయన డైరెక్షన్లో హీరోలు చాలా ఎనర్జీటిక్గా, స్టైలిష్‌గా కనిపిస్తారు. గతంలో వచ్చిన కిక్, రేసు గుర్రం. సైరా వంటి సినిమాలు దీనికి ఉదాహరణలు. ఈ ప్రాజెక్ట్ కూడా అలాంటి మాస్ ప్లస్ స్టైల్ మిక్స్‌తో వస్తుందని టాక్. నిర్మాత రామ్ తల్లూరి గతంలో మాట్లాడుతూ, పవన్ కథ వినగానే చాలా ఇష్టపడ్డారని, ఆయన స్వయంగా వచ్చి హగ్గ్ కూడా చేసుకున్నారని చెప్పాడు. ఇదే నిజం అయితే, ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుంది.
ఈ కాంబినేషన్‌పై పవన్ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. తాజాగా ఈ వార్తలు వెలుగులోకి రావడంతో, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తే, “OG” తరహాలో మరొక మాస్ ఫీస్ట్ రెడీ అవుతుందన్న మాట.పవన్ చివరిగా ఓజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.