Pawan kalyan-sujeeth Movie | ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘OG’. సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని సుజీత్ ఈ సినిమాను సిద్ధం చేశాడు. పైగా పవన్‌కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ ఇప్పటి నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. కాగా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా ప్రారంభమైయ్యాయి.
అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్ ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. తాజాగా ఈ ఈవెంట్‌కు పవన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌తో పాటు పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి థమన్ కూడా వచ్చాడు. దాంతో ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా థమన్ దాదాపు ఖరారైనట్లే అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
THE OG HAS ARRIVED!!! #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/Zwxutwps9f
— DVV Entertainment (@DVVMovies) January 30, 2023