చిట్యాల, ఫిబ్రవరి 03 : చిట్యాల నేషనల్ హైవేపై కత్తిపోటు కలకలం రేపింది. నల్లగొండ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును ఓ వ్యక్తి నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగాడు. డ్రైవర్ ఇమ్రాన్ కారు ఆపి అతడిని ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక లిఫ్ట్ అడిగి కారులో ఎక్కిన వ్యక్తి అకస్మాత్తుగా ఇమ్రాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మొబైక్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఇమ్రాన్ ప్రతిఘటించడంతో సదరు వ్యక్తి అక్కడినుండి పారిపోయాడు. కత్తివేటుతో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను స్థానికుల సమాచారంతో 108 వాహనంలో నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.