తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకరికొకరు మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారని తెలిసిందే. టైం దొరికితే ఒకరి సినిమా షూటింగ్‌కు మరొకరు వెళ్తుంటారు. సినిమా షూటింగ్, ఇతర విశేషాలు అడిగి తెలుసుకుంటారు. ఒకరి సినిమాలను మరొకరు ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రమోట్ కూడా చేసుకుంటూ అభిమానులకు ఎంటర్టైన్ మెంట్ అందిందించేందుకు రెడీ అవుతుంటారు.
ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కొనసాగించే యాక్టర్ల జాబితాలో ముందువరుసలో ఉంటారు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ ఇద్దరు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరి సినిమా సెట్స్ లో ఇంకొకరు కనిపిస్తే.. అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఇలాంటి స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సినిమా సెట్స్ లో పవన్ కల్యాణ్ ప్రత్యక్షమయ్యాడు.
బాలకృష్ణ (Balakrishna) అండ్ మైత్రీ మూవీ మేకర్స్ తో మాట్లాడి సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. వీరసింహారెడ్డి మంచి విజయం అందుకోవాలని కోరుకుంటూ మైత్రీ మూవీ మేకర్స్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహరవీరమల్లు (hari Hara Veera Mallu) సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. రామోజీ ఫిలింసిటీలో ఇటీవలే హరిహరవీరమల్లు భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది.
వీరసింహారెడ్డి సెట్స్ లో పవన్ ..
A frame for the ages ♥️
Veera Mallu meets Veera Simha Reddy 😍Natasimham #NandamuriBalakrishna and the team of #VeeraSimhaReddy with @PawanKalyan on the sets 🔥@megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/VnvXwL5f5Q
— BA Raju's Team (@baraju_SuperHit) December 23, 2022
మరోవైపు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ త్వరలోనే అన్‌స్టాపబుల్ 2లో సందడి చేయబోతున్నట్టు ఇప్పటికే ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో పవన్, బాలయ్య ఒక్కచోట చేరడం ఆసక్తికరంగా మారింది.
Read Also : Trivikram Srinivas | తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది: త్రివిక్రమ్ శ్రీనివాస్
Read Also :Butterfly | అనుపమ పరమేశ్వరన్ బట్టర్ ఫ్లై నుంచి అమ్మ వీడియో సాంగ్
Read Also : Hombale Films | హోంబలే ఫిలిమ్స్ టార్గెట్ ఫిక్స్.. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్కు భారీ ప్లాన్