Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అంటేనే ఫ్యాన్స్‌లో జోష్, థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్లో ఉంటుందో మనందరికి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “ఓజీ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన తొలి రోజే ₹154 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇప్పటివరకు ₹335 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో “ఓజీ” సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.ఇక దీపావళి కానుకగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి పవన్ కళ్యాణ్‌కి ఒక అదిరిపోయే ట్రిబ్యూట్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ పెయింటింగ్‌ను దీపాలతో కళాత్మకంగా అలంకరించారు. ఇది అభిమానుల హృదయాలను తాకేలా రూపొందించబడింది. నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థ ఒక భారతీయ హీరోకి ఇలాంటి ట్రిబ్యూట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఆ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్ అవ్వడం గర్వకారణం.
నెట్‌ఫ్లిక్స్ వీడియో చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఎవ్వరికి అందదు అతని రేంజ్” అంటూ ఓజీ సినిమాలోని లిరిక్‌తో కామెంట్లు షేర్ చేస్తున్నారు. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ క్రియేటివ్ ట్రిబ్యూట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, త్వరలో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో “ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్” ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. పవర్ స్టార్ క్రేజ్ అంటే ఓ రేంజ్! థియేటర్లో గాని, ఓటీటీలో గాని పవన్ కళ్యాణ్ హంగామా ఓ రేంజ్‌లోనే ఉంటుంది.
Fire isn’t OG’s weapon. It’s his signature 🔥 pic.twitter.com/egi2t2U0Kp
— Netflix India South (@Netflix_INSouth) October 24, 2025