Samuthirakani Interview | యాక్టర్‌గా, డైరెక్టర్‌గా తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సముద్రఖని (Samuthirakani). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బ్రో జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు సముద్రఖని. బ్రో సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయడంపై మీ రియాక్షన్..?
నా ప్రయాణాన్ని చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టా. బ్రో సినిమా డైరెక్టర్‌గా నా 15వ ప్రాజెక్ట్. పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కోసం ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఒక్కసారి పవన్ కల్యాణ్ ఒప్పుకున్న వెంటనే అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. సినిమాలో ఆయన ‘టైం’ (కాలం) పాత్రలో కనిపిస్తారు. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ సన్నివేశాలు ఫన్నీగా సాగుతూ.. ప్రేక్షకులను ఫుల్ ఎంటన్టైన్ చేస్తాయి.
వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ గురించి..?
ముందుగా చెప్పినట్టు.. ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. వినోధయ సీతమ్ డైరెక్ట్ చేయాలన్న ఆలోచనకు 16 ఏండ్లకే బీజం పడింది. నా మెంటర్ కే బాలచందర్ ఓ నాటకాన్ని చూసేందుకు తీసుకెళ్లారు. అదే వినోధయ సీతమ్. చాలా ఏండ్ల తర్వాత ఇది కార్యరూపం దాల్చింది. ఈ సినిమాతో నా జీవిత లక్ష్యంలో సగం పూర్తి చేరుకున్నానన్న భావన కలుగుతోంది. తెలుగులో డైరెక్ట్ చేసిన తర్వాత నా ధ్యేయాన్ని చేరుకున్నట్టు భావిస్తున్నా. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నా.
పవన్ కల్యాణ్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..?
ఆయన అద్బుతమైన వ్యక్తి. సినిమా ఒప్పుకున్న వెంటనే సెట్స్‌లో జాయిన్ అయిపోయారు. పవన్ కల్యాణ్ పోర్షన్‌ను పూర్తి చేసేందుకు కేవలం 21 రోజులు మాత్రమే తీసుకున్నాం. పవన్ లాంటి నిజాయితీ గల వ్యక్తితో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా.
మీ స్క్రిప్ట్‌లో త్రివిక్రమ్ ఏం మార్పులు చేశారు..?
కథ గురించి చర్చించిన తర్వాత 10 నిమిషాల్లోనే స్క్రీన్ ప్లే రెడీ చేశారు త్రివిక్రమ్. ఆయన చేసిన మార్పులు నా కథపై ఎలాంటి ప్రభావం చూపవు. సినిమాకు మరింత జోష్ ఇస్తాయి. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.
ఇద్దరు యాక్టర్లను సెట్స్‌లో ఎలా హ్యాండిల్ చేశారు..?
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ మధ్య రియల్ లైఫ్‌లో ఉండే కెమిస్ట్రీ నాకు చాలా సాయం చేసి.. బూస్ట్‌లా పనిచేసింది. దీంతో నా పని చాలా సులభమైంది. ఇద్దరూ ఎప్పుడూ సెట్స్‌లో ఫన్నీగా ఉంటారు. నా సినిమాకు కావాల్సింది కూడా అదే. నేనిప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఉత్తమ సినిమా బ్రో.
థమన్‌తో పనిచేయడంపై..
బ్రో రీరికార్డింగ్ సమయంలో మొదటిసారి థమన్ పనితనాన్ని చూశా. ఆయన వర్క్‌తో నా కండ్లలో నీళ్లు తిరిగాయి. థమన్ కూడా నా పనికి ఇంప్రెస్ అయ్యాడు. థమన్ పదకొండేళ్ల వయస్సులో కోల్పోయిన ఆయన తండ్రిని గుర్తు చేసుకుంటూ చెప్పిన కథ నా హృదయానికి హత్తుకుంది. సాధారణంగా విడుదల సమయంలో మ్యూజిక్ డైరెక్టర్లు మాకు దూరంగా ఉంటారు. కానీ థమన్ మాత్రం ప్రతీ క్షణం నా పక్కనే ఉండి భరోసా ఇచ్చారు.
మీ కొత్త సినిమాల గురించి..
ఓ తమిళ సినిమాతోపాటు రానా దగ్గుబాటి ప్రొడక్షన్లో దుల్కర్ సల్మాన్‌తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నా. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడిస్తా.