Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తన అభిమానుల మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని కడప పర్యటనకు వెళ్లిన పవన్ మీడియాతో మాట్లాడుతుండగా.. అతని అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అసహనానికి గురైన పవన్ కళ్యాణ్.. అభిమానులను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా.. పక్కకి వెళ్లండి అంటూ అసహ్యించుకున్నాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఫుల్ వైరల్గా మారింది. అయితే ఈ విషయంపై తాజాగా మంగళగిరిలో జరిగిన ప్రెస్ మీట్లో స్పందించారు.
ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. ఓజీ అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ఈ మధ్య అభిమానులు ఎక్కడికి వెళ్లిన ఓజీ ఓజీ అని పిలుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. అలా పిలవకండి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను.. వాళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. హరిహర వీరమల్లు ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.. అన్ని సినిమాలు ఒక్క దాని తర్వాత ఒకటి పూర్తి చేస్తాను అంటూ పవన్ చెప్పుకోచ్చాడు.
Also Read..