PawanaKalyan-Raviteja Movie | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా రీమేక్ సినిమాలను చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్స్లోపు వీలైనన్ని సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని వేగంగా సినిమాలను చేస్తున్నాడు. కొత్త కథలైతే సమయం ఎక్కువ పడుతుంది. రిస్క్ కూడా ఉంటుంది. అదే రీమేక్ చిత్రానికి ఎక్కువ సమయం అవసరముండదు అనే భావనతో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ చిత్రాలకు మొగ్గు చూపుతున్నాడు. ‘వకీల్‌సాబ్’, ‘భీమ్లానాయక్’ రెండు వరుస సినిమాలు రీమేక్‌గా రూపొందినవే. ఇవే కాకుండా త్వరలోనే తమిళ రీమేక్ ‘వినోదయ సిత్తం’ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఈయన మరో రీమేక్‌ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడట.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘విక్రమ్ వేద’ సినిమా తెలుగులో రీమేక్ కానున్నట్లు గతం నుండే వార్తలు వస్తున్నాయి. మరోసారి ఈ చిత్ర తెలుగు రీమేక్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో మాధవన్ పాత్రలో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించగా విజయ్ సేతుపతి పాత్రలో రవితేజ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే. విక్రమ్ వేద హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. వేద పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.