Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రావడంతో సినిమాలపై కాస్త ఆసక్తి తగ్గించారు. అయితే గతంలో కమిటైన సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్లో ఇది మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో, ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. సినిమా ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీగా మారింది.
ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదట కరోనా ప్రభావం, ఆ తర్వాత పవన్ రాజకీయంగా బిజీగా ఉండటంతో షూటింగ్ తరచూ నిలిచిపోయేది. రిలీజ్ డేట్లు ప్రకటించినా, వర్క్ పూర్తి కాక మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇటీవల కూడా రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ మారింది. చివరకు జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ సర్కిళ్లలో కూడా మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదన్న వార్తల నేపథ్యంలో, నిర్మాత ఏఎం రత్నం స్వయంగా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. చిత్రాన్ని పూర్తిచేయడానికి పవన్ తన పారితోషికంలో భాగం వెనక్కి ఇచ్చినట్టు కూడా టాక్ ఉంది.
మీడియా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, ఈ సినిమా కోసం తన రూల్స్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్లలో పూర్తిగా భాగస్వామ్యం కావడానికి ఆయన రెడీ అయ్యారు. నేడు జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కానున్న పవన్, ఈ రోజు ఉదయం పది గంటలకి జరగనున్న గ్రాండ్ ప్రెస్ మీట్లో కూడా పాల్గొననున్నారని సమాచారం. తెలుగులో ప్రమోషన్లు బాగానే జరుగుతున్నా, ఇతర భాషల్లో ప్రమోషన్ల విషయంలో ఆలస్యం జరిగింది. ఈ గ్యాప్‌ని పూడ్చేందుకు పవన్ స్వయంగా బిగ్ ఛానెల్స్ ఇంటర్వ్యూలు, ఇతర రాష్ట్రాల్లో జరగబోయే ఈవెంట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన అభిమానులకు, సినిమా బిజినెస్ వర్గాలకు గుడ్ న్యూస్.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నాడు.