OG | ఇప్పటికే బ్రో సినిమాతో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). పవన్ కల్యాణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తుండగా.. వీటిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పవర్ ఫుల్ ఓజీ అప్డేట్ రాబోతుంది. పవన్ కల్యాణ్ వారియర్‌గా కనిపిస్తున్న నయా లుక్ ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఓజీ షూటింగ్ పూర్తి చేసేందుకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు 30 రోజులు అవసరం అవుతాయని సమాచారం.
ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పటికే ఓజీలోని కీలక సన్నివేశాలను ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత ఓజీలో స్టైలిష్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు నెట్టింట చక్కర్లు కొడుతున్న స్టిల్స్ ద్వారా తెలిసిపోతుంది.
ఇప్పటికే ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పవన్ కల్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పవన్ కల్యాణ్ దీంతోపాటు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో నటిస్తుండగా.. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Powerful #OG update arriving today.#TheyCallHimOG #PawanKalyan pic.twitter.com/rsCzc5L1iR
— Manobala Vijayabalan (@ManobalaV) August 15, 2023
Welcome aboard, @SriyaReddy!
Your presence in #OG will be a shocker and a banger. 🤙🏻 #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/YMQwjsSk59
— DVV Entertainment (@DVVMovies) June 13, 2023
#OG #FireStormIsComing #TheyCallHimOG @DVVMovies @dop007 @prakashraaj @PawanKalyan @sujeethsign pic.twitter.com/RfbKwkZ3VB
— Sriya Reddy (@sriyareddy) June 13, 2023