పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కొత్త షెడ్యూల్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో భారీ పోరాటఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. వీటికోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ ఖాకీ దుస్తులు ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు.
‘మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ను వినూత్న రీతిలో ప్రజెంట్ చేయబోతున్నాడు. పోలీస్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: హరీష్‌శంకర్.