Pawan Kalyan | టాలీవుడ్లో ఉన్న లీడింగ్ బ్యానర్లలో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ స్టార్ యాక్టర్ టీంతో కలిసి పనిచేయనుంది. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో కాదు పవన్ కల్యాణ్. ఓ వైపు నటుడిగా, మరోవైపు డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పటికే తన హోం ప్రొడక్షన్స్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ను కొనసాగిస్తున్నాడని తెలిసిందే.
అయితే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మల్టీ ఫిల్మ్ అగ్రిమెంట్ చేసుకుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యానర్లు రెండు భారీ చిత్రాలకు కలిసి పనిచేయనున్నాయి. పవన్ కల్యాణ్ ఈ రెండు సినిమాలకు క్రియేటివ్ డైరెక్షన్, కంటెంట్ అప్రూవల్, టైటిల్స్ వంటి అంశాలను కూడా చూసుకోనున్నాడట.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే హరిహరవీరమల్లుతోపాటు బ్రో సినిమాకు అసోసియేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత టీజీ విశ్వప్రసాద్, మరోవైపు యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్ కలిసి సినిమాలు చేస్తున్నారంటే అంచనాలు మరింత పెరుగడమే కాదు.. బాక్సాఫీస్ వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో ఉండబోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు
ICC | భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో భారీ కోత..!