OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. పవర్ స్టార్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఓజీ (OG). సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఓజీ జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటోంది.
ముంబై షెడ్యూల్ పూర్తయినట్టు తెలియజేస్తూ మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారని తెలిసిందే. దీంతోపాటు పవన్ కల్యాణ్ థిక్ బ్లూ కలర్ టీ షర్ట్- సన్ గ్లాసెస్ లుక్ స్టిల్‌ను కూడా షేర్ చేశారు. ఈ లుక్‌ను తెగ వైరల్ చేస్తూనే.. పవన్ కల్యాణ్ ధరించిన టీ షర్ట్, సన్ గ్లాసెస్ ధర ఎంతో కనుక్కునే పనిలో పడ్డారు అభిమానులు. అయితే తాజాగా నెట్టింట నడుస్తున్న టాక్ ప్రకారం Hugo Boss T-shirt ధర రూ.11 వేలు కాగా, Mont Blanc సన్ గ్లాసెస్ ధర రూ.24 వేలు ఉందట. మొత్తానికి ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్.. కాగా ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. సుజిత్ టీం 45 రోజుల షెడ్యూల్లో ఓజీ మేజర్ పార్టు షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడని ఇన్సైడ్ టాక్. పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. పవన్ కల్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుండగా.. ఈ మూవీ చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నాడు.