OG | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ప్రస్తుతం బ్రో సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ ప్రాజెక్ట్ (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నాలుగో షెడ్యూల్‌తోపాటు మరో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు ఇప్పటికే సుజిత్ అధికారికంగా తెలియజేశాడు. తాజాగా మరో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓజీ నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో షురూ కానుంది. ఈ షూట్లో పవన్ కల్యాణ్ కూడా జాయిన్ కాబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
ఓజీ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఓజీలోని పలు సన్నివేశాలను ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో కంప్లీట్ చేశారు. ఈ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత ఓజీలో స్టైలిష్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు లొకేషన్ నుంచి బయటకు వచ్చిన స్టిల్స్ ద్వారా తెలిసిపోతుంది.
ఇప్పటికే ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. పవన్ కల్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. దీంతోపాటు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్.
Welcome aboard, @SriyaReddy!
Your presence in #OG will be a shocker and a banger. 🤙🏻 #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/YMQwjsSk59
— DVV Entertainment (@DVVMovies) June 13, 2023
#OG #FireStormIsComing #TheyCallHimOG @DVVMovies @dop007 @prakashraaj @PawanKalyan @sujeethsign pic.twitter.com/RfbKwkZ3VB
— Sriya Reddy (@sriyareddy) June 13, 2023