Pawan Kalyan | ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ప్రజలకి చాలా దగ్గరగా ఉంటూ సేవలు అందిస్తున్నారు.నిత్యం ప్రజల మధ్యే ఉంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు తాను సైన్ చేసిన సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఐదేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, కొన్నాళ్లుగా మూవీ చిత్రీకరణ నత్తనడకన సాగుతుంది. అయితే ఎట్టకేలకి ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఓజి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు, పలు సందర్భాల్లో బహిరంగ సభల్లోనూ ఓజీ, ఓజీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయగా, అప్పుడు పవన్ వారిని సున్నితంగా మందలించారు.
అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో వారిలో జోష్ నెలకొంది. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో ‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం.’ అంటూ అధికారికంగా వెల్లడించింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జోష్ నెలకొంది. ‘సాహో’ ఫేం సుజీత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగింది. ఈ వారమే ఈ మూవీ సెట్స్‌లో పవన్ జాయిన్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య ‘ఓజీ’ మూవీని నిర్మిస్తుండగా.. ముంబయి మాఫియా నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్ చేస్తుండగా.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.