OG | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఓజీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన HUNGRY CHEETAH గ్లింప్స్ నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఓజీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా ఈ సినిమా కొత్త అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఓజీ మిషన్‌లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు ఎస్ థమన్. మొత్తానికి ఓజీ ఫస్ట్ సింగిల్‌తో స్పీకర్లు బద్దలైపోవడం గ్యారంటీ అని తాజా స్టిల్‌తో చెప్పకనే చెబుతున్నాడు థమన్. ఇటీవల ఏపీ ఎన్నికల్లో విక్టరీ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు సీక్వరించనున్నారని తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఓజీ షూటింగ్‌కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమోనని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్తో శుభవార్త చెప్పాడు ఎస్ థమన్.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. టాలీవుడ్ యాక్టర్ వెంకట్, కోలీవుడ్ భామ శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. పవన్ కల్యాణ్ దీంతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాల్లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
ఎస్ థమన్ ట్వీట్ ఇలా..
THE MAN is on a mission 😁🔥#TheyCallHimOG #OG @MusicThaman pic.twitter.com/Q2yICvolaR
— DVV Entertainment (@DVVMovies) June 17, 2024