పాలిటిక్స్‌లో బిజీ కావడం వల్ల షూటింగులకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. వీటిలో వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. పవన్ ఇంకొన్ని రోజులు డేట్స్ ఇస్తే ఆ సినిమా షూటింగ్‌లు పూర్తయిపోతాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తున్నది.
డిసెంబర్ మొదటివారం వరకూ అంటే, దాదాపు పదిరోజులు ఈ సినిమా షూటింగ్లో పవన్ పాల్గొననున్నారట. దీనికోసం విజయవాడ పరిసరాల్లో భారీ సెట్టింగ్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక ‘ఓజీ’ విషయానికొస్తే.. డిసెంబర్ నెలలోనే ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అక్కడ తీసే యాక్షన్ షూట్‌తో ‘ఓజీ’లో పవన్ పార్ట్ పూర్తవుతుందట. మొత్తానికి ఈ రెండు సినిమాకూ మోక్షాన్నిచ్చే దిశగా పవన్ అడుగులేస్తున్నారని వినికిడి.