Darsanam Mogulaiah : ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ పాడిన మొగులయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
మొగులయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం | ఆ పాటకు గాత్రాన్ని అందించింది ఎవరో కాదు.. మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య.

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త మూవీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ పాటకు గాత్రాన్ని అందించింది ఎవరో కాదు.. మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య.
ఆ పాట ప్రారంభంలో వచ్చే లిరిక్స్‌ను ఆయన పాడి అందరినీ మెప్పించాడు. ఆ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోందంటే దానికి కారణం.. మొగులయ్య పాడటమే. మొగులయ్య శభాష్ భీమ్లా నాయక్.. అంటూ సాగే పాటను పాడగా.. ఆ తర్వాత కొనసాగింపుగా వచ్చే పాటను ప్రముఖ సింగర్స్ శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల పాడారు.

అయితే.. కిన్నెర వాద్య పరికరాన్నే నమ్ముకున్న దర్శనం మొగులయ్య చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పటికీ ఆయనకు రెక్కాడితే కానీ డొక్కాడదు. కిన్నెర పరికరంతో ఊళ్లు తిరుగుతూ ఎన్ని వీరగాథలు చెప్పినా కూడా ఎవరూ పట్టెడన్నం కూడా పెట్టడం లేదు. ఆయన చాలా కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. మొగులయ్యకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా 2 లక్షల రూపాయల చెక్‌ను మొగులయ్యకు అందజేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Darsanam Mogulaiah : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన ‘దర్శనం మొగులయ్య’ వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
ప్రభుత్వమిచ్చే 10వేల పింఛనే ఆసరా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

