Pawan Kalyan | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే దిశగా ముందుకెళ్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారాహి యాత్రకు అంతా సిద్దమైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇక నుంచి తన ఫోకస్ ఎక్కువగా వారాహి యాత్ర (varahi yatra)పై పెట్టబోతున్నట్టు అర్థమవుతోంది.
అయితే నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా సెట్స్ పై ఉన్న సినిమాలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్‌పై చాలా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో సినిమాలు చేస్తున్న మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రానున్న రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో కూడా షూటింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు.
రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో ఎక్కువగా ఏపీలోనే ఉండబోతున్న నేపథ్యంలో మంగళగిరి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, ఏఎం రత్నం, బీవీఎస్ఎస్ ప్రసాద్‌తోపాటు డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రకటించారు. వారాహి షెడ్యూల్స్‌తో పవన్ కల్యాణ్ బిజీగా ఉండనుండటంతో.. హీరో డేట్స్ విషయంలో షూటింగ్స్ షెడ్యూల్స్కు ఇబ్బంది కలగకుండా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నట్టు తాజా అప్డేట్తో అర్థమవుతోంది.
పవన్ కల్యాణ్ చేతిలో హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ (OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ప్రాజెక్టులున్నాయి.ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే సముద్రఖని డైరెక్షన్లో నటిస్తున్న బ్రో లుక్‌తోపాటు ఉస్తాద్ భగత్ ఫస్ట్ గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
Producers of #PawanKalyan‘s upcoming films decided to shoot their films going forward as much as possible in the surroundings of Mangalagiri, Vijayawada & Guntur in Andhra Pradesh. pic.twitter.com/iNqKKX71NE
— Aakashavaani (@TheAakashavaani) June 13, 2023