Pawan kalyan On Instagram | పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో తెగ బిజీగా గడుపుతున్నాడు. ప్రేక్షకులను ఓ వైపు ఎంటర్టైన్ చేస్తూ.. మరో వైపు లీడర్‌గా జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇటివలే వారాహితో విజయయాత్ర మొదలు పెట్టి దిగ్విజయంగా దూసుకుపోతున్నాడు. ఇక పవన్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటాడు. రాజకీయాలకు, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను ట్విట్టర్లో పంచుకుంటుంటాడు. ట్విట్టర్లో పవన్‌కు 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు.
ఇలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి చేరుతున్నారు. అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్‌లో ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాలోకి పవన్ అడుగుపెట్టాడట. ప్రస్తుతం పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతున్నాడు. పవన్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. అందులో బ్రో మరో నాలుగు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటుగా సుజీత్‌తో ఓజీ, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ చేస్తున్నాడు. ఇక క్రిష్‌తో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.