Pawan Kalyan | జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పవన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు. ఈ సినిమా నిర్మాత ఏ.ఎం. రత్నం ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటుడగా.. ఆయన వద్ద నుంచి తీసుకున్న రూ. 11 కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తుంది. సినిమా విడుదల పరంగా. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న పవన్, సినిమా విడుదలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని సమాచారం. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ‘హరి హర వీర మల్లు’ సినిమా విడుదల తేదీపై గందరగోళం ఇంకా కొనసాగుతునే ఉంది. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూలై 4న విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.