Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి చాలా రోజుల తర్వాత వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే .. కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్‌లో జరుగుతుంది. జూన్ 12న చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ హడావిడి పెద్దగా కనిపించడం లేదు. కనీసం ట్రైలర్ కూడా విడుదల కాలేదు. ట్రైలర్ కోసమైతే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ఇంకా 9 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో కీలకమైన ట్రైలర్ విడుదల చేయకపోవడంతో అభిమానులే కాకుండా మిగతా ఆడియెన్స్ కి సినిమాకి దూరాన్ని ఇంకా పెంచినట్టుగా మారుతుంది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా మూవీ ఈవెంట్ నిర్వహిస్తారనే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే ఈ వారాంతంలో ఒక భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో జూన్ 8న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికోసం పవన్ కల్యాణ్ 7వ తేదీన తిరుపతి చేరుకోనున్నట్టు తెలుస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని అనంతరం ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కానున్నారని అంటున్నారు.
మరోవైపు చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించిన మేకర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. మిగిలిన హీరోల సినిమాల్లా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్నే వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ అనుకున్నారు. కాని సమయం లేకపోవడంతో ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ ఇంకా తదితర స్టార్ నటీనటుల కలయికలో దర్శకులు క్రిష్ జాగర్లమూడి ,జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.