Pawan Kalyan | రాజకీయాలలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశారు. ఆయన ఎప్పుడో కమిటైన హరిహర వీరమల్లు చిత్రం పూర్తి చేసి త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్నా కూడా అది కుదరడం లేదు. రిలీజ్ డేట్ చెప్పడం…సడెన్ గా వాయిదా వేయడం గత ఏడాదిగా చూస్తూనే ఉన్నాం. దాదాపు 12 సార్లు మూవీ రిలీజ్ వాయిదా పడింది. చివరిగా మే 9న రిలీజ్ అంటూ మరో తేదీ ప్రకటించారు. కానీ పవన్ అప్పటికి పూర్తి చేయాల్సిన పార్ట్ మిగిలిపోవడంతో చిత్రం తిరిగి వాయిదా పడింది. అయితే ఇటీవల చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ పూర్తైందని తెలిపారు. దీంతో అందరు మూవీ జూన్‌లో వస్తుందేమో అని అనుకుంటున్నారు.
తాజాగా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ మూవీ జూన్ 12 రిలీజ్ కానున్నట్లు టికెట్స్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో తెలిపింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇదే రిలీజ్ డేట్ అంటూ పవన్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. మరి ఇది నిజమా? అబద్దామా? అన్నది తేల్చా ల్సింది మేకర్స్. వాళ్లు అధికారికంగా ఇంకా ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మరి ఈ తేదీ విషయంలో మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లుగా లీక్ రావడంతో బుక్ మై షో ఇలా ప్రకటించి ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.
అయితే ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిత్రీకరణ పూర్తయినంత వరకూ సీజీ పూర్తయింది. బ్లాక్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే ట్రైలర్ త్వరలోనే విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రానికి సంబంధించి విడుదలైన లుక్స్, సింగిల్స్ ఆకట్టుకుంటున్నాయి.పవన్ సరసన నిధి అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.