Pawan Kalyan | ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏ ముహూర్తాన కూటమి అంటూ బీజేపీతో చేతులు కలిపాడో కానీ అప్పటినుంచి ఆ పార్టీకి ఊడిగం చేస్తున్న విషయం తెలిసిందే. హస్తినాన ఉన్న పెద్దలను సంతోషపరచడానికి ఉప ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే సనాతన ధర్మం.. హిందువులు ఆపదలో ఉన్నారంటూ అంటూ కొత్త పాటను అందుకున్నాడు. ఒకప్పుడు చెగువేరా అంటూ కమ్యునిస్ట్ భావాలను నరనరాన ఎక్కించుకున్న పవన్ ఆ తర్వాత ఎరుపు నేరిస్తే కాషాయమే అన్న సామెతను బాగా అలవాటు చేసుకుని హిందుత్వ రాజకీయాలకు దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం దేశంలో భాషా వివాదం చెలరేగుతుంటే మతృ భాషను పక్కనపెట్టి హిందీ భాష మనకు పెద్దమ్మ లాంటిదని చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెలుగు ప్రజలకి చిర్రెత్తుకుచ్చాయి.
ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ హిందీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకు మాతృభాష తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ లాంటిదని చెప్పుకోచ్చాడు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. హిందీలో డబ్ అయిన 31% దక్షిణాది సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయని గుర్తుచేశారు. వ్యాపారానికి హిందీ కావాలి కానీ, నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది అంటూ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
కొందరూ ఏమో ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ పెద్దల కోసం హిందీ రాగం అందుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికా ఓటు వేసి గెలిపించిందంటూ మరికొందరూ కామెంట్లు పెడుతున్నారు.
What a man @PawanKalyan 🔥 pic.twitter.com/0YC0LlMnmX
— Radoo (@Chandan_radoo) July 11, 2025
Dear illiterate @PawanKalyan,
1. India doesn’t have a national language.
Hindi is also just another regional language.2. English should be the international linked language. Also, English enhances our employment opportunities.
3) We Telugus will oppose Hindi imposition on us. https://t.co/my6M3q3bbA
— Pratyusha (@Pratyusha_125) July 11, 2025
మీ పిల్లలు చదువుకునే స్కూల్ లో leadership team లో కనీసం ఒక్కరు కూడా ఇండియన్స్ లేరు.
ఇక్కడ అసలు హిందీ బోధిస్తారా? తెలుగు?
మరి జనాల మీద ఎందుకు రుద్దుతున్నారు?? @PawanKalyan https://t.co/cnuWAtkujf pic.twitter.com/99hHdfeunQ— MBR (@BharathMBNR) July 11, 2025
Pawan kalyan is killing the self respect of the Telugu speaking population.
Telugu and english must be the only languages you should be learning and these are more than enough.
This guy is ruining everything in the state.
Religious wars, caste wars and now language wars.
— Punk (@IcarusPunk21) July 11, 2025