యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సముద్రఖని (Samuthirakani) . ఈ ఏడాది భీమ్లానాయక్, సర్కారు వారి పాట లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో మెరిశాడు. ఈ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో వినోధయ్ సీతమ్ (Vinodaya Sitham) రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ జులై నుంచి మొదలు కానుందట.
ఇంకో అప్ డేట్ ఏంటంటే..పవన్ కల్యాణ్ తాజా రీమేక్ కోసం 18-20 రోజులపాటు డేట్స్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ కాల్షీట్లలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన షూటింగ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేయనున్నారట. ఈ చిత్రంలో టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఫీ మేల్ లీడ్ రోల్స్ కోసం కృతిశెట్టి, శ్రీలీల పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్.
పవన్ కల్యాణ్ ఇప్పటికే హిందీలో తెరకెక్కించిన పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మరో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కొషియుమ్ను రీమేక్ భీమ్లానాయక్ లో కూడా నటించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లు తెచ్చిపెట్టాయి. మరి వినోధయ సీతమ్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.