Game Changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej), దిగ్గజ దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ చేసిన టీం తాజాగా టీజర్ కూడా విడుదల చేసింది. ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. జనవరి ఫస్ట్ వీక్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టీం ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ వేడుకను కూడా గోదావరి జిల్లాలు అయిన (తాడేపల్లిగూడెం, కాకినాడ, రాజమండ్రి)లో ఏదైన ఒక దాంట్లో చేయాలని మూవీ టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం.