వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ అనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ టైటిల్ ను మరియు ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ ఆగస్ట్ 15 వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఫస్ట్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, అగ్రెసివ్ ఆటిట్యూడ్ తో అభిమానులకు పూనకాలు తెప్పించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంది. దీంతో ఫస్ట్ గ్లింప్స్ వీడియో పలు రికార్డులు నమోదు చేస్తుంది. టాలీవుడ్లో 24 గంటలలో ఎక్కువ మంది చూసిన ఫస్ట్ గ్లింప్స్ గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.
భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో 8.49 మిలియన్ వ్యూస్‌తో పాటు 728.6కె లైక్స్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతకు ముందు సైరా..7.2 మిలియన్స్ వ్యూస్ , 287 కె వ్యూస్, రాధే శ్యామ్ .. 5.07మిలియన్ వ్యూస్‌తో పాటు 394 కె లైక్స్ సాధించాయి. పవన్ అభిమానులు సృష్టించిన భీబత్సంతో భీమ్లా నాయక్ ఖాతాలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.