Pawan kalyan | పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన ఇద్దరు తమిళ కుర్రాళ్లు..!
Pawan kalyan Fans | భాష ఏదైనా సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం తెలుగు ప్రేక్షకులకే చెల్లింది. హీరో మనవాడా, డైరెక్టర్ మనవాడా అని తేడాలు లేకుండా అన్ని సినిమాలను మనవాళ్లు ఆదరిస్తుంటారు. ముఖ్యంగా మనవాళ్లు తమిళ సినిమాలను తెగ ఆదరిస్తుంటారు.
Pawan kalyan Fans | భాష ఏదైనా సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం తెలుగు ప్రేక్షకులకే చెల్లింది. హీరో మనవాడా, డైరెక్టర్ మనవాడా అని తేడాలు లేకుండా అన్ని సినిమాలను మనవాళ్లు ఆదరిస్తుంటారు. ముఖ్యంగా మనవాళ్లు తమిళ సినిమాలను తెగ ఆదరిస్తుంటారు. ఆ ఇండస్ట్రీ హీరోలను మన హీరోలుగా చెప్పుకుంటుంటారు. కానీ తమిళ బ్యాచ్ మాత్రం ఎప్పుడు తెలుగు సినిమాలను తక్కువ చేస్తూనే ఉంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో సార్లు చర్చలు కూడా జరిగాయి. రజనీ, కమల్, సూర్య సహా తమిళ హీరోల్లో చాలా మందికి ఇక్కడ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అక్కడ వాళ్లు మాత్రం ఎప్పుడు మన హీరోలను ట్రోల్ చేస్తూనే ఉంటారు.
కాగా తాజాగా అరవ బ్యాచ్ చేసిన ఓ వీడియో పవన్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. వారం కిందట జరిగిన బ్రో ప్రీ రిలీజ్ వేడుకలో పవన్.. తమిళంలో హాట్ టాపిక్‌గా నిలిచిన రూల్స్ గురించి మాట్లాడాడు. అది కూడా తప్పు పట్టేలాగా, కించపరిచేలాగా కాదు. కేవలం వాళ్లకు సూచనలు, విన్నపాలివ్వడం లాంటివి చేశాడు. మరి అది అర్ధంకాకో.. లేక అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేకో కొంతమంది అరవ బ్యాచ్ అదే పనిగా బ్రో సినిమాను అడ్డం పెట్టుకుని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రోలింగ్ ఎంత మీతిమీరిందంటే తమ్ముడు సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ పాట లిరిక్స్ ప్లేస్‌లో బ్రో రిజల్ట్, వారాహి రాజకీయ యాత్రని వెటకారం చేస్తూ ఇద్దరు యువకులు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మాములు దుమారం రేపడం లేదు. అందులోనూ ఫిలిం కంపానియన్ అనే ఓ పెద్ద ఫిలిం వెబ్ ఛానల్ లోగో ఆ వీడియోలో కనిపించడం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆ వెబ్ ఛానల్‌ను ట్యాగ్ చేస్తూ అభిమానులకు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నారు.
సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాలను తెలపడం తప్పుకాదు కానీ.. ఇలా మితిమీరడం సరికాదని పోస్ట్‌లు పెడుతున్నారు. ముందు వెయ్య కోట్లు బొమ్మ కొట్టి చూపించమని, పొన్నియన్ సెల్వన్ అర్థమయ్యేటట్టు తీయమని పవన్ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
😂😂#BroTheDisaster @FilmCompanion pic.twitter.com/cXZRYC3sZX
— Sunil (@sunil_hitler) July 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

