They Call Him OG | అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ పాత్ర ైస్టెలిష్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అరవైశాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా టైటిల్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిత్రం విడుదల చేసిన పోస్టర్లో ‘ఓజీ’.. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అంటూ ట్యాగ్‌లైన్‌ను రివీల్ చేశారు. తాజాగా సోషల్‌మీడియాలో టైటిల్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ చిత్రానికి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నామని పేర్కొంది. దీంతో టైటిల్ విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నది. డివీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.