Pawan Kalyan | టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొన్ని రోజులుగా ఏపీలో వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత వారాహి యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. వారాహి యాత్ర విజయవంతం కావడంతో పవన్ కల్యాణ్-అన్నా కొణిదెల దంపతులు కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వారాహి రెండో విడత యాత్ర త్వరలోనే షురూ కానుంది.
జనసేన (Jana sena party) రెండో విడత యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాల కోసం పవన్ కల్యాణ్ మంగళగిరి వెళ్లనున్నారని తెలియజేస్తూ జన సేన పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva)తో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా వీరిద్దరూ విడిగానే ఉంటున్నారని.. అన్నా లెజినోవా తన పిల్లలతో కలిసి రష్యా వెళ్లిపోయిందంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ చేసిన ట్వీట్‌తో పుకార్లకు ఫుల్స్టాప్ పడినట్టైంది.
మరోవైపు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కల్యాణ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో బ్రో చేస్తున్నాడు. రీసెంట్గా లాంఛ్ చేసిన బ్రో టీజర్ వైరల్ అవుతోంది. మరోవైపు సుజిత్ డైరెక్షన్లో ఓజీ, క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు.
జన సేన పార్టీ ట్వీట్..
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023