Pawan Kalyan | రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో శనివారం రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. అభిమానులందరూ ఓజీ.. ఓజీ అని మళ్లీ పిలవడం మొదలుపెట్టారు.
పవన్‌ని ఇప్పటికే చాలా సార్లు ఓజీ ఓజీ పిలుస్తూ అభిమానులు ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పవన్ కూడా అసహనంకి గురై ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిదంటూ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యాడు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ ఈవెంట్లో కూడా అభిమానులు ఇలానే చేయడంతో OG, OG అని నా దుంప తెంపేస్తున్నారయ్యా అంటూ పవన్ అభిమానులను ఉద్దేశించి అన్నాడు. OG సినిమా గురించి తర్వాత మాట్లాడుదాం. ఓజీ దర్శకుడు కూడా ఇక్కడే ఉన్నాడు. నా చేతిలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా.. నా సినిమాలకంటే మీ ఫ్యూచర్ నాకు ముఖ్యం. మీ ప్యూచర్ కోసం ఇలానే ఉండిపోయాను. అందుకే ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. గేమ్ ఛేంజర్ కోసం వచ్చాను కాబట్టి ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఓజీ ఈవెంట్లో దాని గురించి మాట్లాడుకుందాం అంటూ పవన్ చెప్పుకోచ్చాడు.
OG, OG అని నా దుంప తెంపేస్తున్నారయ్యా!!! pic.twitter.com/AjTB7ePKRM
— Aakashavaani (@TheAakashavaani) January 4, 2025