Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పవన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాట సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, మాస్ ఎనర్జీతో వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు ఈ సినిమా కూడా ‘ఓజీ’ రేంజ్‌లోనే హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు. అయితే, ఈ సినిమాలో ఓ అంశం పవన్ అభిమానులను కాస్త ఆలోచనలో పడేస్తోంది. అదే ప్లాప్ సెంటిమెంట్. గబ్బర్ సింగ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్‌కు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ రాలేదన్న చర్చ ఉంది. ఇటీవల వచ్చిన ఆయన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరోవైపు హీరోయిన్ శ్రీలీలకు కూడా ఇటీవల వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెపై నెగటివ్ టాక్ వినిపిస్తోంది.
ఈ సెంటిమెంట్ చర్చలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ మార్కెట్, ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు ప్రధాన బలం అని అభిమానులు విశ్వసిస్తున్నారు. పవన్ మాస్ అప్పీల్, హరీష్ శంకర్ స్టైల్ డైలాగ్స్ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఉంది. విడుదల తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ అంచనాలను అందుకుంటుందా? లేక సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.