Pawan Kalyan | ఒకేసారి రెండు సినిమాలు చేయడం అనేది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో ఎప్పుడు జరగలేదు. కానీ ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల కారణంగా ఒకసారి రెండు సినిమాలు కాదు.. ఏకంగా మూడు నాలుగు కమిట్ అవుతున్నాడు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు పవర్ స్టార్.
అక్టోబర్ 1 నుంచి వారాహి నాలుగవ విడత యాత్ర ఉండడంతో దర్శక నిర్మాతలకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేశాడు పవన్. మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో విజయవాడ వెళ్లి రెండు మూడు రోజులు అక్కడ సమయం కేటాయించింది మినహాయిస్తే.. ఎక్కువగా షూటింగ్లోనే ఉన్నాడు. ముఖ్యంగా హరీష్ శంకర్ (Harish shankar) ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh) షూటింగ్ ఈ మధ్య వేగంగానే జరుగుతుంది.
తాజాగా కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది. సెప్టెంబర్ 25 నుంచి 30 మధ్యలో కేవలం 5 రోజులు డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈలోపు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు ఈ దర్శకుడు. వారాహి యాత్ర పూర్తి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇటు హరీష్ శంకర్.. అటు సుజిత్ మధ్య నలిగిపోతున్నాడు పవన్. ఎవరికి డేట్స్ ఇవ్వాలో.. ఎవరిని క్యూలో పెట్టాలో తెలియక తెగ ఇబ్బంది పడుతున్నాడు. పవన్ లేని సన్నివేశాలతో ఓజీ (OG)షూటింగ్ పూర్తయింది.
ఆయన కేవలం 14 రోజులు డేట్స్ ఇస్తే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది.. కానీ ఆ రెండు వారాల డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు ఉస్తాద్ ఆయనకు కీలకమైన సినిమా ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా ఈ సినిమాను వాడుకోవాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని పవర్ స్టార్ ప్రణాళిక. ఇందులో అధికార పార్టీపై పొలిటికల్ సెటైర్లు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ప్రతి సీన్ పంచ్ డైలాగ్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే కావాలంటే ఓజీని కొన్ని రోజులు పక్కనపెట్టి హరీష్ శంకర్ సినిమాను పూర్తి చేయాలి అని చూస్తున్నాడు జనసేనాని.
కేవలం ఈ కారణంతోనే అక్టోబర్లో కూడా ఎక్కువగా హరీష్ సినిమాకు డేట్స్ అలాట్ చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఏ సినిమా ముందు విడుదల చేయాలి.. ఏది చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ పవన్ కళ్యాణ్ కు ఎంత ఉందో.. సుజిత్ కు కూడా అంతే ఉంది. అందుకే తన సినిమాకు డేట్స్ ఇవ్వకపోయినా అడ్జస్ట్ చేసుకుంటున్నాడు ఆయన. ఒకవేళ ఇస్తే వెల్ అండ్ గుడ్. మొత్తానికి చూడాలిక ఈ సుడిగుండం నుంచి పవన్ ఎలా బయట పడతాడో..!
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..