Pawan- Charan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతోను బిజీగా ఉన్నారు. అయితే ఆయన గతంలో కమిటైన సినిమాలని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. పవన్ నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు చిత్రంకి సంబంధించిన అన్ని పనులు పూర్తి కాగా, జులై 24న సినిమాని విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇటీవల గ్రాండ్‌గా విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్‌ను, సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
ఈ నెల 24న విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు పార్ట్ 1పై హైప్ కొనసాగుతుండగానే, పార్ట్ 2కి సంబంధించిన గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యమైనది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి సంబంధించిన వార్త. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు పార్ట్ 2లో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నాడన్న బజ్ గట్టిగా వినిపిస్తోంది. ఇది నిజమైతే, పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఒకే స్క్రీన్ మీద కలిసి కనిపించటం సినీ అభిమానులకు పండుగే అని చెప్పాలి. ఈ కాంబినేషన్ మెగా ఫ్యాన్స్‌కి ఒక ఊహించని ట్రీట్‌గా నిలవనుంది.
చిత్రంలో చరణ్ పాత్ర కథని కీలక మలుపు తిప్పుందని, సినిమా స్థాయిని మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం భారీగా నిర్మిస్తున్నారు. అయితే పవన్ – చరణ్ కాంబినేషన్‌ని స్క్రీన్‌పై చూడాలన్నది మెగా ఫ్యాన్స్ కోరిక. ఇప్పుడు అది హరిహర వీరమల్లు 2తో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.