బాలీవుడ్లో ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నాయి. రణబీర్ – ఆలియా, సిద్ధార్థ్ – కియారా, కేఎల్ రాహుల్ – అతియాశెట్టి..ఇలా వరుసగా ప్రేమ పెండ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ వివాహాలకు అతిథిగా వెళ్తున్న అందాల తార పరిణీతి చోప్రాను నీ పెళ్లెప్పుడు? అని అంతా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు స్పందిస్తున్న పరిణీతి నేను పెండ్లికి వ్యతిరేకం కాదు. వైవాహిక జీవితం కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది. తన వివాహం గురించి పరిణీతి చోప్రా…‘నా స్నేహితులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. వాళ్లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. నాకూ పెండ్లి చేసుకోవాలని, పిల్లలతో ఆడుకోవాలని ఉంది.
కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితమూ అంతే ముఖ్యం. సినిమానే జీవితం కాదు కదా. పెండ్లయితే నా జీవితంలో ఓ పెద్ద పని పూర్తవుతుంది. కోరుకున్న వ్యక్తి దొరికితే అతన్ని ప్రేమిస్తాను, పెండ్లి చేసుకుంటాను. ఇప్పటిదాకా నా జీవితంలో అలాంటి వాడే కనిపించలేదు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ నాయిక ఖాతాలో ‘క్యాప్సుల్ గిల్’, ‘ఛమ్కీలా’ చిత్రాలున్నాయి.