Parineeti Chopra : సెలబ్రిటీ కపుల్ రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా (Parineeti Chopra) తల్లిదండ్రులయ్యారు. ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన పరిణీతి ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తమ సంతోషాన్ని రెట్టంపు చేసిన తీపికబురును ‘చేతులు నిండుగా.. హృదయాలు మరింత నిండుగా’ అంటూ అభిమానులకు వెల్లడించిందీ జంట.
‘మేము ఎదురుచూసిన మా కలల పంట మా కుమారుడు.. ఈరోజు మా ఒడిలోకి వచ్చాడు. అతడి రాకతో మేము ఇంతకుముందు జీవితాన్ని మర్చిపోయామనుకోండి. మా చేతులు నిండుగా ఉన్నాయి. హృదయాలు కూడా మరింత నిండుగా ఉన్నాయి. మొదటగా మేమూ ఒకరికొకరంగా ఉన్నాం. ఇప్పుడు మా బిడ్డ రాకంతో మాకు అన్నీ ఉన్నాయి. మీ అందరికీ కృతజ్ఞతలతో.. పరిణీతి, రాఘవ్’ అని ఇన్‌స్టా్గ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది సెలబ్ కపుల్.
తొలిసారి పేరంట్స్ అయిన రాఘవ్, పరిణీతికి బాలీవుడ్ స్టార్లు, రాజకీయా నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. కంగ్రాట్యులేషన్స్ అంటూ హార్ట్ ఎమోజీస్ పెట్టింది నటి కృతి సనన్. డిజైనర్ మనీష్ మల్హోత్రా స్పందిస్తూ.. రాఘవ్, పరిణీతికి అభినందనలు చెప్పాడు. యువనటి అనన్యా పాండే సైతం వావ్.. కంగ్రాట్యులేషన్స్ అంటూ పోస్ట్ పెట్టింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయిన రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాల నిశ్చితార్ధం 2023లో జరిగింది. ఆ ఏడాది సెప్టెంబర్ 24న ఉదయ్‌పూర్‌లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈమధ్యే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని వెల్లడించారు ఇద్దరూ. ‘మా చిన్ని ప్రపంచం త్వరలోనే రాబోతోంది. ఆ దేవుడి ఆశీర్వాదం లభించందుకు చెప్పలేనంత సంతోసంగా ఉన్నా’మంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కాసంత బ్రేకిచ్చిన పరిణీతి.. నిరుడు అమర్ సింగ్ ఛమ్కీలా సినిమాలో నటించింది.