Parineeti Chopra-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నారంటూ గతకొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు జంటగా పలుసార్లు కలిసి ముంబయిలో డిన్నర్‌కు వెళ్లారు. పరిణీతి పలుమార్లు ఢిల్లీకి రాగా.. రాఘవ్ చద్దా రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. ముంబయి, ఢిల్లీలో ఇద్దరు జంటగా చిక్కడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని, డేటింగ్ వార్తలు నిజమేనని వార్తలకు ఊతమిచ్చినట్లయ్యింది.
వీరిద్దరికి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ అరోరా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని, ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకోబుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంపై ఇప్పటికీ ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా పరిణీతి చోప్రా ముంబయి ఎయిర్‌పోర్టులో మెరిసింది. చేతికి ఉంగరం సిల్వర్ కలర్లో రింగ్ కనిపించింది. దాంతో రాఘవ్ చద్దాతో ఎంగేజ్మెంట్ జరిగిందని ప్రచారం జరుగుతున్నది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతితో సంబంధంపై ప్రశ్నించగా.. ఆయన నవ్వుతూ ‘ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ మారింది సంబురాలు చేసుకోండి. ఆ తర్వాత మరిన్ని జరుపుకునేందుకు సందర్భాలుంటాయి’ అంటూ దాటవేశారు. గతంలో పరిణీతి చోప్రా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన సందర్భంలో రాఘవ్ చద్దాతో రిలేషన్ షిప్‌పై స్పందించగా.. సిగ్గుపడుతూ.. నవ్వుతో సమాధానం ఇవ్వకుండా గుడ్‌నైట్ అంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఎంగేజ్మెంట్ వార్తలపై.. క్లారిటీ ఇస్తారా? లేదా? చూడాలి మరి.