Parasakthi Release Announcement | ఇటీవల మదరాసి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు శివ కార్తికేయన్ తన తదుపరి ప్రాజెక్ట్ పరాశక్తిని విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను పోంగల్ కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే పోంగల్ (జనవరి 9న) కానుకగా మరోవైపు విజయ్ నటించిన జననాయగన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటి నెలకొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటంపై దర్శకురాలు సుధా కొంగర స్పందించింది. సినిమా విడుదల తేదీని నిర్మాతలు నిర్ణయిస్తారని.. ఈ విషయంలో తనకు పూర్తి అవగాహన లేదని పేర్కొంది.
పరాశక్తి సినిమా విషయానికి వస్తే.. శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శ్రీలీల (హీరోయిన్), రవి మోహన్ (విలన్), అథర్వ, రానా దగ్గుబాటి, బేసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
#VivaLaRevolución 🔥 #ParasakthiPongal on January 14 2026@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @redgiantmovies_ @Aakashbaskaran @sreeleela14 @dop007 @editorsuriya @supremesundar #KarthikRajkumar @devramnath @rhea_kongara @deathbycheesy pic.twitter.com/9Qp3FIUcSe
— Sudha Kongara (@Sudha_Kongara) September 12, 2025