Sreeleela | తమిళంలో సూరరై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్‌తో మూవీని తెరకెక్కించిన సుధా కొంగర ప్రస్తుతం పరాశక్తి అనే మూవీని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇందులో విలన్‌గా రవి మోహన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ‘ఆషిఖి-3’ లాంటి క్రేజీ మూవీ చేస్తున్న శ్రీలీల.. తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటిస్తుండడం ఆసక్తిని రేపుతుంది.
ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో మూవీపై తమిళం, తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ‘పరాశక్తి’ సినిమా వల్ల శ్రీలీల తమిళ్ ఎంట్రీ కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. ‘పరాశక్తి’ తనకు తమిళ్లో మంచి క్రేజ్ తెస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ భామకి ఇప్పుడు నిరాశే ఎదురవుతుంది. పరాశక్తి మూవీ పలు సమస్యలలో ఇరుక్కోవడంతో సినిమా రిలీజ్ అవుతుందా, లేదా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. . ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన శివకార్తికేయన్‌కు పరాశక్తి సినిమా నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్ల పారితోషకం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
పరాశక్తి సినిమాను నిర్మిస్తున్న డాన్ పిక్చర్స్ అధినేతలు ఓ స్కామ్‌లో ఇరుక్కోగా, ఈడీ అధికారులు ఆ నిర్మాతలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు శివకార్తికేయన్‌కి మార్కెట్ కంటే ఎక్కువ పారితోషికం ముట్టజెప్పారని, అందులో బ్లాక్‌మనీ ఎక్కువ ఉందనే ప్రచారం నడుస్తుంది. ఇక ఆ డబ్బుతో అతనికి ఓ ఖరీదైన భవనాన్ని నిర్మిస్తున్నారని తమిళ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఈ స్కామ్ చాలా పెద్దదనే తెలుస్తోంది. దాంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డట్లే కనిపిస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలు ఈడీ అధికారుల వలలో చిక్కుకోవడంతో శివ సైతం ఇబ్బందుల్లో పడ్డాడని అంటున్నారు. ఈ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉందని.. చిత్రీకరణ ముందుకు సాగడం కష్టమని కూడా అంటున్నారు. దాంతో శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీకి చెక్ పడ్డట్టే అని కొందరు జోస్యం చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో.