యోగేశ్వర్, అతిధి జంటగా నటిస్తున్న చిత్రం ‘పరారీ’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ చిత్రం పోస్టర్‌ను సెకండ్ టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నేటి యువతరంను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.