అర్జున్ అంబటి కథానాయకుడిగా రూపొందుతోన్న థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. నాగశివ దర్శకుడు. గడిమిట్ల శివప్రసాద్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ని వేగవంతం చేశారు.
ఈ క్రమంలో సినిమాలోని ‘చిన్ని చిన్ని తప్పులేవో..’ అని సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. రాంబాబు గోశాల రాసిన ఈపాటను, డేవ్ జాంద్ స్వరపరచగా పృథ్వీ చంద్ర, అదితి బావరాజు కలిసి ఆలపించారు. యువతను ఆకర్షించే రీతిలో ఈ పాట సాహిత్యం, చిత్రీకరణ సాగింది. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సహనిర్మాత: గుడిమిట్ల ఈశ్వర్, నిర్మాణం: ఎస్.ఎస్.మీడియా.