కవిన్, అపర్ణదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘డా..డా’ అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ‘పా..పా’ పేరుతో తెలుగులో రానుంది. జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరజ కోట తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మారుతి ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ సినిమా కథాంశం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందన్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 30 కోట్లకుపైగా వసూళ్లను సాధించిందని, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్‌శక్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జెన్‌మార్టిన్, దర్శకత్వం: గణేష్ కె బాబు.