Ante Sundaraniki Movie | విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నాని ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో నాని ఇప్పటివరకు వెనకకు తిరిగి చూసుకోలేదు. తన సహజ నటనతో ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు. రొటీన్ భిన్నంగా విభిన్న కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికి’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ సినిమాపైన ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పంచకట్టు’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
‘ఏంటీ సార్ ఓకే నా..’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. భారతీయ సంగీతాన్ని వెస్టర్న్ సంగీతాన్ని కలగలిపినట్టుగా వివేక్ సాగర్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ కట్టాడు. హర్షిత్ గోలీ రచించిన ఈ పాటను ప్రముఖ లెజెండరీ కర్ణాటక సింగర్ పద్మశ్రీ అరుణ సాయిరాం ఆలపించారు. ఇక ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నానికి జోడిగా మలయాళీ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవలే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది.
Saaroru- Promo 😉#ThePanchaKattu song! https://t.co/sHJA2tAuXY#AnteSundaraniki #VivekSagarMusical#NazriyaFahadh #VivekAthreya #PadmaShriArunaSairam
— Nani (@NameisNani) April 5, 2022