Panch Minar OTT | తెలుగులో విడుదలైన సినిమాలు సాధారణంగా థియేటర్లలో కనీసం నాలుగు వారాలు పూర్తయ్యాకే ఓటీటీలోకి వస్తాయి. అయితే ఈసారి ఆ రూల్ పూర్తిగా బ్రేక్ అయింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ‘పాంచ్ మినార్’ సినిమా కేవలం 7 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. రాజ్ తరుణ్, రాశి సింగ్ నటించిన ‘పాంచ్ మినార్’ 2025 నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. కానీ వారం రోజులు కూడా పూర్తి కాకముందే, నవంబర్ 28 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత వేగంగా ఓటీటీ రిలీజ్ చాలా అరుదుగా జరుగుతుంది.
రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా, మొత్తం సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేదు. దీనికి ప్రధాన కారణాలుగా పరిశ్రమలో మూడు ప్రధాన అంశాలు చెప్పబడుతున్నాయి. సరైన ప్రమోషన్లు లేకపోవడం,తక్కువ బజ్ , అదే వారం విడుదలైన పెద్ద సినిమాల పోటీ..ఈ కారణాల వల్ల ‘పాంచ్ మినార్’ బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. రాజ్ తరుణ్, రాశి సింగ్‌తో పాటు బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, సుధర్షన్, ఘోష్ వంటి నటులు నటించినప్పటికీ ఈ చిత్రం జనాలలోకి వెళ్లలేదు. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లో వీక్షించే అవకాశం పొందుతున్నారు. ఓటీటీ ప్రేక్షకులు కొత్త కంటెంట్‌పై ఎక్కువ ఆసక్తి చూపడం వలన ఈ ప్లాట్‌ఫార్మ్‌లో సినిమా ఎలా రాణిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ‘పాంచ్ మినార్’ ఓటీటీలోకి వచ్చిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర దక్కని ప్రేక్షకాదరణను ఓటీటీ తెచ్చిపెడుతుందా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తం మీద… కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘పాంచ్ మినార్’ సినిమా పరిశ్రమలో ఒక రకంగా సంచలనం రేపింది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో కొత్త ఊపును అందుకోవచ్చు. నిజంగా ప్రేక్షకులు దీనికి రెండో అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తితో ఎదురుచూడాల్సిందే.