అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆదివారం చిత్ర బృందం ప్రకటించింది. ‘ఈ తేదీ తర్వాత పాన్ ఇండియా అంతటా ఏజెంట్ కోసం ఎదురుచూస్తారు’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. అఖిల్ గూఢచారి ఏజెంట్‌గా కనిపిస్తారు. ఆయన లుక్స్ ైస్టెలిష్‌గా ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సురేందర్ రెడ్డి తనదైన శైలిలో చిత్రాన్ని తీర్చిదిద్దారు’ అని చిత్రృబృందం పేర్కొంది. ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్హాప్ తమిజ, కథ: వక్కంతం వంశీ, సహనిర్మాతలు: అజయ్ సుంకర, దీపారెడ్డి, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.