వైవిధ్యమైన కథలతో ప్రత్యేకతను చాటుకుంటున్న మలయాళ హీరో టొవినో థామస్ నటించిన పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించారు. కయాద్ లోహర్ కథానాయికగా నటించింది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. బుధవారం మోషన్ పోస్టర్ను విడుదల చేశారు.
1950, 60 దశకాల్లో కేరళలోని వలస రైతు కుటుంబాల నేపథ్యంలో జరిగే కథ ఇదని, ఆధిపత్యానికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. టోవినో థామస్ పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని, తన వారిని రక్షించుకోవడానికి ఆయన చేసే పోరాటం స్ఫూర్తివంతంగా అనిపిస్తుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: టీజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: డిజో జోస్ ఆంటోని.