Palli chattambi | ‘పల్లీ చట్నీ’ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రేజీ యాక్షన్ డ్రామా ‘పళ్లిచట్టంబి’!
Palli chattambi | 'పళ్లిచట్టంబి'.. ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్‌కు ముందుగా స్ట్రైక్ అయింది 'పళ్లి చట్నీ'. అవును, ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు తెలుగువాళ్లంతా కాస్త అవాక్కయ్యారు.
Tovino Thomas | ‘పళ్లిచట్టంబి’.. ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్‌కు ముందుగా స్ట్రైక్ అయింది ‘పల్లీ చట్నీ’. అవును, ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు తెలుగువాళ్లంతా ఇలాగే అవాక్కయ్యారు. ఏంటి.. తెలుగులో పెట్టడానికి నిర్మాతలకు ఇంతకంటే మంచి పేరు దొరకలేదా? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో ఆటాడుకున్నారు. కానీ, కట్ చేస్తే.. కంటెంట్ ఉన్న సినిమాకి టైటిల్స్ అడ్డుకావని ఈ చిత్రం నిరూపించింది. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్ఫుల్ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో ఈ టైటిల్ వెరైటీని చూసి మిస్ అయిన వారి కోసం ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’ (SonyLIV) లో జులై 24 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రాబోతోంది.
సినిమా కథ విషయానికి వస్తే.. 1957 నాటి కేరళ భూసంస్కరణల బిల్లు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. చర్చి భూములను కాపాడటం కోసం ‘పోతన్ క్రిస్టోఫర్’ (టొవినో థామస్) అనే యువకుడిని చర్చి రక్షకుడిగా (చట్టంబి) నియమిస్తారు. అయితే, అతని అసలు పేరు కృష్ణ పిళ్లై. ఒక హిందూ యువకుడైన కృష్ణ పిళ్లై, మారుపేరుతో చర్చిలోకి ఎందుకు అడుగుపెట్టాడు? కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న రెబెక్కా (కయాదు లోహర్)తో అతని ప్రేమాయణం ఎలా సాగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను దర్శకుడు డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

