దర్శకుడు కరుణ కుమార్ రూపొందించిన ‘పలాస 1978’ సినిమా చెన్నైలో జరిగే వానమ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. దళిత నేపథ్యమున్న సాహిత్యం, సినిమాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ…‘ఓ మంచి సినిమా రూపొందిస్తే అందరూ గుర్తిస్తారని చెప్పేందుకు ‘పలాస 1978’ సినిమానే ఉదాహ రణ. వానమ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శనకు మా చిత్రం ఎంపికవడం సంతోషంగా ఉంది. దళిత జీవన చిత్రాన్ని ఆవిష్కరించే సినిమాలెన్నో ఇక్కడ ప్రదర్శితమవుతాయి. వాటి సరసన మా మూవీ చేరడం గర్వంగా ఉంది’ అన్నారు.