ఆహా: జూన్ 12
తారాగణం: చైతన్య రావు, శ్రద్ధాదాస్, సునీల్, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
కామెడీ యాక్షన్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. కథలో కీలకమైన మలుపులు లేకపోయినా… హాస్యం పండితే ఈ తరహా సినిమాలు ఆడేస్తుంటాయి. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ‘పారిజాత పర్వం’ ఈ తరహా చిత్రమే! బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కథలోకి వెళ్తే.. హీరో కావాలన్న లక్ష్యంతో శ్రీను (సునీల్) భీమవరం నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటాడు. సినిమా వాళ్లు వస్తారనే ఉద్దేశంతో కృష్ణానగర్‌లోని ఓ బార్లో వెయిటర్‌గా చేరుతాడు. అక్కడే పార్వతి (శ్రద్ధా దాస్) క్లబ్ డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది. ఒకరోజు బార్ యజమాని పార్వతితో అనుచితంగా ప్రయత్నిస్తుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో శ్రీను చేతిలో ఓనర్ చనిపోతాడు.
మరోవైపు చైతన్య (చైతన్య రావు) ఎలాగైన దర్శకుడు కావాలనే పట్టుదలతో ఉంటాడు. శ్రీను కథతో సినిమా తీయాలని భావిస్తాడు. పలువురు నిర్మాతలు చైతన్యతో సినిమా తీయడానికి అంగీకరిస్తారు. అయితే చైతన్య తన స్నేహితుడు హర్ష (వైవా హర్ష) హీరోగా చేస్తాడని చెప్పడంతో ఓకే అన్న నిర్మాతలూ వెనక్కి వెళ్తారు. ఇలా లాభం లేదనుకొని సినిమా నిర్మాణం కూడా తనే చేపట్టాలని భావిస్తాడు చైతన్య. ఇందుకోసం సినీ నిర్మాత శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) భార్య సురేఖ (సురేఖవాణి)ని కిడ్నాప్ చేయాలని ఫిక్సవుతాడు. ఆ కిడ్నాప్ ఎటు దారి తీసింది? అతనికి ఎదురైన సవాళ్లేంటి? చైతన్య సినిమా తీశాడా? శ్రీను హీరో అయ్యాడా? లేదా? అన్నది అసలు కథ.