Bandi Sanjay | సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారా అనే చర్చ ఇప్పుడు తీవ్రంగా సాగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను వెనకేసుకొస్తూ, అతడు చేసిన పనిలో తప్పేమీ లేదని, కేవలం బండి సంజయ్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారంటూ కొందరూ ఇన్ఫ్లుయెన్సర్లు పెయిడ్ ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దొర సాయితేజ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి సపోర్ట్‌గా వీడియోను రుపొందించాడు. అయితే సాయితేజ చేసిన ఈ పెయిడ్ వీడియోలు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై నెటిజన్లతో పాలు పలు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు, బాధితురాలికి అండగా ఉండాల్సింది పోయి.. అధికారంలో ఉన్న వ్యక్తుల కుమారులకు వత్తాసు పలకడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బులు తీసుకుని ఇలాంటి సున్నితమైన అంశాల్లో తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే.. అధికారం ఉన్నవారి కుమారుడు అని తెలిసి కూడా ఇంత సిగ్గులేకుండా సమర్థిస్తారా?” అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సాయితేజను నిలదీస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, డబ్బుల కోసం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే ఇలాంటి ధోరణి ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Social media influencers are making paid videos after taking money.
An influencer named Dora Saiteja is making videos.. after taking money.. claiming that what Union Minister Bandi Sanjay’s son did is not wrong, and that all this is being done politically to trouble Bandi… pic.twitter.com/DTCPdXaIph
— Telangana First (@TelanganaFirst_) May 12, 2026